తెలంగాణలో రాహుల్ చేసింది కూడా ఓటు చోరీ కాదా..? మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-11 08:35:32  IST  )

రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేవనెత్తిన ‘ఓట్ల చోరీ’ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

తెలంగాణలో రాహుల్ చేసింది కూడా ఓటు చోరీ కాదా..? మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేవనెత్తిన ‘ఓట్ల చోరీ’ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బిహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష పార్టీల నేతలు చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని.. బారికేడ్లతో సంసద్ మార్గ్‌ను పోలీసులు మూసివేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలంతా నడిరోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.

అయితే, ఢిల్లీ (Delhi)లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓట్ల చోరీ’ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ‘ఓట్ల చోరీ’ అంశంపై చర్చ జరగడం బాగానే ఉందన్నారు. కానీ, తెలంగాణ (Telangana) ఎన్నికల మెనిఫెస్టోలో 420 వాగ్దానాలు, ఆరు గ్యారంటీలను ఆయా దిన పత్రికల్లో ప్రొజెక్ట్ చేస్తూ పవిత్రమైనవిగా కాంగ్రెస్ నాయకులు చూపారని ఆరోపించారు. అలా తప్పుడు ప్రకటణలో అధికారంలోకి వచ్చిన వారు 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఆరోపించారు. ఓట్లు, సీట్లు సాధించిన తర్వాత ఆ హామీలను నెరవేర్చే విషయాన్ని పూర్తి విస్మరించారని.. ఇది ఓట్ల చోరీ కాదా.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story