- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahakumbh Mela : మహాకుంభమేళా పోలీసులకు యోగి సర్కార్ నజరానా!
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా(Mahakumbh Mela) జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26వరకు 45రోజుల పాటు కొనసాగి ప్రపంచ అతిపెద్ధ అధ్యాత్మిక కార్యక్రమంగా నిలిచింది. 65కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంతో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించగా..అంతటి రద్ధిని నియంత్రించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో పోలీసులు చేసిన కృషి విస్మరించలేనిది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా(Mahakumbh Mela) జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26వరకు 45రోజుల పాటు కొనసాగి ప్రపంచ అతిపెద్ధ అధ్యాత్మిక కార్యక్రమంగా నిలిచింది. 65కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంతో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించగా..అంతటి రద్ధిని నియంత్రించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో పోలీసులు చేసిన కృషి విస్మరించలేనిది.
అందుకే మహాకుంభమేళాలో సేవలందించిన పోలీసులకు యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ ప్రభుత్వం(UP CM Yogi Adityanath's) ప్రత్యేక నజరానాల(Special Regards)తో సత్కరించింది. "మహా కుంభమేళా" సందర్భంగా సేవలందించిన 75 వేల మంది పోలీసులకు యోగి ప్రభుత్వం ప్రత్యేక రూ.10,000 బోనస్, 'మహా కుంభ సేవా పతకం', 7 రోజుల సెలవులు ప్రకటించింది. 45రోజుల పాటు మహాకుంభమేళాలో తాము పడిన కష్టాన్ని గుర్తించిన యోగి సర్కార్ కు పోలీస్ సిబ్బంది తమ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యేకంగా కవితా రచన..గానం ద్వారా సీఎం యోగికి కృతజ్ఞతలు తెలపడం విశేషం. అంతకుముందు యోగి ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు కూడా రూ.10వేల నగదు, ఆరోగ్య బీమా ప్రకటించారు. మహాకుంభమేళాలో విధులు నిర్వర్తించిన ప్రతి విభాగం సిబ్బందికి యోగి ప్రభుత్వం ప్రత్యేక నజరానాలు అందిస్తుండంతో సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.






