- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం ఇలాకాలో ఇలాంటి ఘటనలా..? కల్వకుంట్ల కవిత సెన్సేషనల్ ట్వీట్
గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహం (SC Hostel)లో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహం (SC Hostel)లో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు వారిని సిబ్బంది హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇవాళ ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు వెళ్లారు. అరగంట అనంతరం విద్యార్థులకు వాంతులు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వచ్చాయని, ఆ విషయాన్ని వార్డెన్‌కు చెప్పడంతో పడేశారని విద్యార్థులు తెలిపారు. ఆ వెంటనే అరటి పండ్లతో పాటు బిస్కెట్లు తిని స్కూల్‌కి వెళ్లగా కొద్దిసేపటికే అందరికీ కడుపునొప్పి, వాంతులైనట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గద్వాల ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాష్ట్రంలో నిత్యం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు ఆవేదనకు గురి చేస్తున్నాయని.. ఇతర జరుగుతోన్నా.. ఈ సర్కార్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ సంక్షేమ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందని కామెంట్ చేశారు. విద్యాశాఖను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వద్దే ఉన్నా.. ఆయన ఇలాకాలోనే వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటని కవిత ఆక్షేపించారు.






