నీటి పారుదల శాఖ ENC అనిల్ కుమార్ బదిలీ

by Muthe.Rajitha |

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్(ENC) ఎం. అనిల్ కుమార్‌(Anil Kumar)ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నీటి పారుదల శాఖ ENC అనిల్ కుమార్ బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్(ENC) ఎం. అనిల్ కుమార్‌(Anil Kumar)ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయనను ప్రస్తుత పదవి నుంచి తొలగించి, సాధారణ పరిపాలన శాఖ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్)కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం నేడు అధికారిక ఉత్తర్వుల జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) నిర్మాణంలో అనిల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు సంబంధిత విజిలెన్స్ దర్యాప్తులో ఆయన అనేక అవకతవకలు పాల్పడినట్టు నివేదికలు ఉన్నాయి. విజిలెన్స్ కమిషన్ 38 మంది ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. అనిల్ కుమార్‌పై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.

Next Story