- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాలా రోజుల తర్వాత ఒకే వేదికమీద కేటీఆర్, కవిత!
కేటీఆర్, కవిత ఇద్దరికీ ఆహ్వానం..

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 25, 2025న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది. ఈ సందర్భంగా కేటీఆర్ వేదికపై జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొని, దక్షిణ భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మరియు సాంకేతిక పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. 'సదరన్ రైజింగ్ సమ్మిట్' మూడో ఎడిషన్ ఈసారి “భవిష్యత్తుకు సిద్ధం: ఆవిష్కరణ, పరివర్తన, స్ఫూర్తి” (Ready for the Future: Innovation, Transformation, Inspiration) అనే ఇతివృత్తంతో జరగనుంది. ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం, విద్య, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, మరియు స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలలో దక్షిణ రాష్ట్రాలు ఈ విధంగా ముందుకు సాగుతున్నాయో అంశంపై చర్చించడానికి ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమలు మరియు పౌర సమాజానికి చెందిన ప్రముఖులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానుంది.
ఏబీపీ నెట్‌వర్క్ తమ ఆహ్వానంలో, కేటీఆర్ వంటి నాయకులు పాల్గొనడం కేవలం తెలంగాణకే కాకుండా, యావత్ భారతదేశానికి విషను నిర్దేశించడంలో దోహదపడుతుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తెలంగాణ సాధించిన ప్రగతి, భారతదేశ వృద్ధిలో దక్షిణ రాష్ట్రాల పాత్ర, అలాగే తయారీ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆవిష్కరణల ఆధారిత రంగాలలో వస్తున్న కొత్త అవకాశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. కాగా, ఈ సమ్మిట్‌లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నటి మాళవిక మోహనన్, బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై, PMK నాయకుడు అన్బుమణి రామదాస్ వంటి ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు.






