- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రీన్ ఎనర్జీలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. బుధవారం రాజేంద్ర నగర్ లోని తెలంగాణ రూరల్ డెవలప్మెంట్సంస్థలో ఆయన సమక్షంలో రూ. 29 వేల కోట్ల పెట్టుబడులకు టీజీ రెడ్కో తో ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జిపిఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఎంవోయూ చేసుకున్నారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడంతో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్ళినప్పుడు సన్ పెట్రో కంపెనీ 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి రూ. 20వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయు చేసుకున్నదని గుర్తు చేశారు.
అదే విధంగా మెగా కంపెనీ 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రూ. 7500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిందన్నారు. ఈ రెండు కంపెనీలు డిపిఆర్ తయారు చేసే పనిలో ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే ఈ రెండు కంపెనీలకు చెందిన కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైతాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీతో రాష్ట్రంలో రూ. 27 వేల కోట్ల పెట్టుబడులతో 5600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చి ఎం ఓ యు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులతో ప్రజల విద్యుత్ అవసరాలు అధిగమించే అవకాశం ఉందన్నారు. 2023 సంవత్సరంలో 15,623 మెగావాట్ల గరిష్ట పిక్ డిమాండ్ రాగా, ఈ సంవత్సరం మార్చి 20న 17,162 మెగావాట్ల గరిష్ఠ పీక్ డిమాండ్ చేరుకున్నప్పటికీ పకడ్బందీ వ్యూహంతో ఎలాంటి ఇంట్రప్షన్ లేకుండా నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేశామని చెప్పారు.
మహానగరం అభివృద్దితో విద్యుత్‌కు డిమాండ్:
గ్రేటర్నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న త్రిబుల్ఆర్, మూసీ పునర్జీవం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని కొన్ని సంస్థలు అధ్యయనం చేసి కేంద్రానికి పంపిందన్నారు. ఆ నివేదికల ఆధారంగా 2029-30 నాటికి 24,215 మెగావాట్ల గరిష్ట డిమాండ్, 2034- 35 నాటికి 31 809 మెగావాట్ల గరిష్ట డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి ప్రణాళికలు తయారు చేసుకొని ప్రభుత్వం ముందుకెళుతుందని వివరించారు. 2030 నాటికి 20వేల మెగావాట్లు, 2035 నాటికి మరో 20వేల మెగావాట్లు మొత్తం 40 వేల మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకొని యాక్షన్ ప్లాన్ తో ముందుకుపోతుందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఎనర్జీ పాలసీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉండటంతో చాలామంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు.
టీజీ రెడ్కో తో ఎంఓయూ చేసుకున్న ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని, క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని నిర్దిష్ట గడువులోగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. 15 జిల్లాల్లో కంప్రెస్డ్ బయో-గ్యాస్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రెడ్క్తో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్న జిపిఆర్ఎస్ ఆర్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను అభినందించారు. రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగు అవుతున్న నేపథ్యంలో వరి గడ్డితో తయారు చేసే కంప్రెస్డ్ బయోగ్యాస్ వల్ల రైతులకు ఆర్థికంగా ఉపయోగం జరగాలని సూచించారు.






