రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. పాలమూరు-రంగారెడ్డిపై విచారణ!

by Gantepaka Srikanth |

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. పాలమూరు-రంగారెడ్డిపై విచారణ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Ranga Reddy Project)పై విచారణ జరపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీర్మానం చేయనున్నట్లు సమాచారం.

శనివారం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30 శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వాటర్ సోర్సును మార్చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై రూ.90వేల కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్.. పాలమూరుకు రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటార్ ఆన్‌ చేసి జాతికి అంకితం చేశామని ప్రకటించారు. కేసీఆర్‌ మోటార్ ఆన్‌ చేసిన తెల్లారే.. మళ్లీ ఆఫ్ చేశారు. కృష్ణా నది ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది.

Next Story