- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కాళేశ్వరం’పై ముగిసిన విచారణ.. నేడు సర్కార్‌కు నివేదిక ఇవ్వనున్న కమిషన్
‘కాళేశ్వరం’ అనుబంధ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: ‘కాళేశ్వరం’ అనుబంధ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ ముగిసింది. ఈ మేరకు ఇవాళ చైర్మన్ జస్టిస్ పి.చంద్రఘోష్ (Justice Pinaki Chandraghosh) ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు. ఉదయం బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో నివేదికను నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శికి సీల్డు కవర్‌లో అందజేయనున్నారు. అయితే, కాళేశ్వరం కమిషన్ గడువు నేటితో ముగియనుండటంతో జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టను ప్రభుత్వానికి హ్యాండోవర్ చేసి రేపు కోల్‌కతా (Kolkata)కు తిరుగు ప్రయాణం కానున్నారు. సుమారు 15 నెలల పాటు కొనసాగిన ఈ విచారణలో కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీల్లో లోపాలకు బాధ్యులుగా కమిషన్ ఎవరిని తేల్చిందనే అంశంపై అటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.
విచారణలో భాగంగా మొత్తం 119 మందిని జస్టిస్ట్ చంద్రఘోష్ కమిషన్ విచారించింది. 3 బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీతో పాటు ఆయా విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ వరకు విచారించింది. నిర్మాణ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పనిచేసిన రిటైర్డ్ అయిన వారిని, నీటి పారుదల, ఆర్థిక శాఖల్లో పని చేసిన అధికారులు, మూడు బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు వివిధ సంఘాలకు చెందిన వారు విచారణకు హాజరై కీలక పత్రాలను కమిషన్‌కు హ్యాండోవర్ చేశారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు.
కాగా, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటి బుంగలు ఏర్పడిన విషయం విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2023 డిసెంబరులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ విచారణతో పాటు నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ(NDSA)తో అధ్యయనం చేయించింది. అదేవిధంగా కాళేశ్వరంపై న్యాయ విచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చి 14న కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2025 జులై నెలఖరులోగా కాళేశ్వరంపై తుది నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఆయా కారణాలతో కమిషన్ గడువును సర్కార్ పొడిగిస్తూ రాగా.. నేటితో ఆ గడువు ముగిసింది.






