- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టండి.. కెనడా, ఫ్రాన్స్ బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి
సీఎంతో కెనడా హైకమిషనర్, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బృందాలు భేటీ

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హైకమిషనర్‍ను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు. ఇవాళ సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో హైకమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ (Canada High Commissioner) బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మా, ఎయిరోస్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‍లో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కెనడా హైకమిషనర్‍కు వివరించిన ముఖ్యమంత్రి.. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లోనూ పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో కారెన్( karen), కెనడా మినిస్టర్ ఎడ్ జాగర్( Ed Jäger), ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ్రాన్స్ బృందంతో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రాన్స్ (France) కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం మర్యాదపూర్వక భేటీ అయ్యారు. హైదరాబాద్‍లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చింతారు. హైదరాబాద్‍లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని నగరంలో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో మౌద్ మిక్వా, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






