- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో రేవ్ పార్టీ.. 8 మంది అమ్మాయిలు.. 18 మంది అబ్బాయిల అరెస్ట్
హైదరాబాద్‌లో మత్తు కల్చర్ నానాటికి పెరిగిపోతోంది....

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మత్తు కల్చర్ నానాటికి పెరిగిపోతోంది. యువతీ, యువకులు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడిపోతున్నారు. రేవ్ పార్టీల పేరుతో గుప్పుగుప్పుమని లాగించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో గంజాయి కలకలం రేపింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు గచ్చిబౌలిలోని ఓ గెస్ట్ హౌస్‌పై దాడి చేశారు. పెద్ద ఎత్తున గంజాయి, మద్యం సేవిస్తున్న 8 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. ఇంతకుముందు ఎన్నిసార్లు పార్టీలు నిర్వహించారు. పార్టీ వెనుక ఉంది ఎవరు?.’’ అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story






