- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మికుంటకు అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ట్రాక్.. రూ. 6.5 కోట్లతో కేంద్రం గ్రీన్ సిగ్నల్!
కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో, కేంద్ర నిర్ణయంతో ఉత్తర తెలంగాణ యువత కల సాకారమైంది.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో, కేంద్ర నిర్ణయంతో ఉత్తర తెలంగాణ యువత కల సాకారమైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అత్యాధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ (synthetic athletics track) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ప్రత్యేక చొరవతో, 'ఖేలో ఇండియా' పథకం కింద ఈ ప్రాజెక్టుకు రూ. 6.5 కోట్లు కేటాయిస్తూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పంలో భాగంగా ఈ ట్రాక్ అందుబాటులోకి రానుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా వరల్డ్ అథ్లెటిక్స్ (IAAF) ప్రమాణాలకు అనుగుణంగా 400 మీటర్ల పొడవు, 4 లైన్లతో కూడిన సింథటిక్ ట్రాక్‌ను నిర్మించనున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్‌లో ఈ ట్రాక్ ఏర్పాటు కానుంది. దీనివల్ల కరీంనగర్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల గ్రామీణ క్రీడాకారులకు అధునాతన శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. ఈ అనుమతులపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేస్తూ.. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. త్వరలోనే ఈ ట్రాక్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.






