నెలాఖరులోగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్?

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో వార్షిక పరీక్షల షెడ్యూల్ ను మార్చేందుకు ఇంటర్ బోర్డు సన్నద్ధమైంది. జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు విద్యార్థులకు తగిన సమయం ఇచ్చే లక్ష్యంతో ఈసారి ఫిబ్రవరి చివరి వారం నుంచి పరీక్షలు ప్రారంభించాలని భావిస్తోంది.

నెలాఖరులోగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వార్షిక పరీక్షల షెడ్యూల్ ను మార్చేందుకు ఇంటర్ బోర్డు సన్నద్ధమైంది. జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు విద్యార్థులకు తగిన సమయం ఇచ్చే లక్ష్యంతో ఈసారి ఫిబ్రవరి చివరి వారం నుంచి పరీక్షలు ప్రారంభించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి పరీక్షల టైం టేబుల్ షెడ్యూల్ ను ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది పలు కాలేజీలకు గుర్తింపు ఆలస్యం కావడంతో పరీక్షలను మార్చి ఫస్ట్ వీక్ లో ప్రారంభించారు. మరోపక్క జనవరి లాస్ట్ వీక్ లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు అధికారిక వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ఫైల్ ను పంపింది.

ప్రాక్టికల్స్ నిర్వహణ ఫీజు పెంపు

ఇంటర్ పరీక్షల ఫీజు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. దాంతో నిర్వహణ కోసం అదనంగా రూ. 100 పెంచాలని ఇంటర్ బోర్డు భావించింది. అంతే కాకుండా ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు రూ. 520, ప్రాక్టికల్ పరీక్షలుండే ఎంపీసీ, బైపీసీ, జువాలజీ, గ్రూపులతో పాటు ఒకేషనల్ కోర్సులకు అదనంగా మరో రూ.230 కలిపి మొత్తం రూ.750 వసూలు చేస్తున్నారు. ఏపీతో పాటు, సీబీఎస్ఈ, ఇతర బోర్డుల ఫీజు అధికంగా ఉందని, ఇక్కడ కొంత మొత్తం పెంచాలని బోర్డు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ప్రాక్టికల్స్ లేని కోర్సులకు రూ. 600, ప్రాక్టికల్స్ ఉన్న కోర్సులకు రూ. 875 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.

ఫిబ్రవరి 23న పరీక్షలు?

ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో నూతన సంస్కరణలు చేపట్టిన ఇంటర్ బోర్డు, పరీక్షలకు ముందు రివిజన్ చేసేలా సమయాన్ని ఇవ్వాలని యోచిస్తోంది. వీలైనంత త్వరగా సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఏపీలో పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. దీంతో తెలంగాణలో నూ వీలైనంత తొందరగా షెడ్యూల్ రిలీజ్ చేసేం దుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది. ఏపీలో ఇంటర్ ప రీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 24తో ముగియనున్నాయి. అదే మాదిరిగా తెలంగాణ లో నూ ప్రారంభించనున్నారు. రాష్టవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి దాదాపుగా పదిలక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Next Story