- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికలు వద్దు.. వేలంపాటలే ముద్దు! సర్పంచ్ ఏకగ్రీవాలపై ఎమ్మెల్సీ ఆసక్తికర పోస్ట్
ఎన్నికలు వద్దు.. వేలంపాట్లే ముద్దు అని సరికొత్త పెట్టుబడిదారీ, వ్యాపార ప్రజాస్వామ్య సూత్రం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు వద్దు.. వేలంపాట్లే ముద్దు అని సరికొత్త పెట్టుబడిదారీ, వ్యాపార ప్రజాస్వామ్య సూత్రం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో జోరుగా వేలం పాటలు నడుస్తున్నాయని వచ్చిన మీడియా కథనాలపై శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు కాదు అండీ.. వ్యాపార నిమిత్తమైన వేలంపాటలే నడుస్తున్నాయట అని పేర్కొన్నారు. సర్పంచ్ పోస్టులు అభ్యర్థులతో కాదు.. బిడ్డర్లతోనే నియమించబడుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇలా పోతే ఇక MLA, MP సీట్లు కూడా E-Auction లో పెట్టెయ్యడమే మంచిదేమో అని అభిప్రాయం తెలిపారు. అటు ఓటర్లకీ, ఇటు ప్రభుత్వానికీ, ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ భారమే లేదుగా అని పేర్కొన్నారు. వేల కోట్ల పబ్లిక్ ఖర్చు కూడా ఆదా అవుతుందన్నారు.
ప్రచారం లేదు.. ర్యాలీలు లేవు.. ఓటింగ్ కోసం చాంతాడంత లైన్లలో నిలబడి ఇబ్బంది లేదు.. EVMలు, బూతులు, పోలింగ్ స్టాఫ్, పోలీసులు, సెక్యూరిటీ - ఏవి అవసరం లేకుండా “ఆన్‌లైన్ వేలం”తో పని అయిపోతుంది.. అంటూ పేర్కొన్నారు. ‘ఎవడు ఎక్కువ బిడ్ వేస్తాడో వాడే గెలుపు, ‘హయ్యెస్ట్ బిడ్డర్’ MLA, ‘హయ్యెస్ట్ బిడ్డర్’ MP, ఆ వచ్చే డబ్బుతో కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలు..అలా అయితే.. ప్రజాస్వామ్యం మిగిలేది కేవలం స్టాంప్ పేపర్ మీదే. ఓటుకు నోటు, సీటుకు మూట, సరికొత్త పెట్టుబడిదారీ, వ్యాపార ప్రజాస్వామ్య సూత్రం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..






