- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య రన్నింగ్ కామెంట్రీ కనిపించింది. డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు భట్టి ప్రస్తావించగా.. అదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు పొందుపరుచలేదని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పగా.. రైతుబంధు సంగతేంటని గులాబీ సభ్యులు నిలదీశారు.
అలాగే.. ఉచిత కరెంటు, రైతు భరోసా, పంట రుణమాఫీపై మాట్లాడుతుండగా.. అదంతా బోగస్ అంటూ నినాదాలు చేశారు. అలాగే.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రస్తావన వచ్చిన సందర్భంలో, రుణమాఫీ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ సభ్యులు స్లోగన్స్ ఇచ్చారు. అలాగే.. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఎకరాకు రూ.12వేల సాయం అందిస్తామని భట్టి చెప్పగా.. గతేడాది రూ.15వేలు అన్నారంటూ ప్రశ్నించారు. ఇలా ప్రతిసారీ భట్టి స్పీచ్‌కు వారు అడ్డుగా వస్తుండడంతో.. కాంగ్రెస్ సభ్యులు సైతం అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన వైఫ్యలాలను గుర్తుచేస్తూ.. చేపల పులుసు అంటూ నినాదాలు చేయడం కనిపించింది.






