Pawan Kalyan: ఆ వాదానికి పరిమితి.. బీఆర్ఎస్ పేరు మార్పుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మారడంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: ఆ వాదానికి పరిమితి.. బీఆర్ఎస్ పేరు మార్పుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావడం, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దూసుకు వస్తుందడంతో ప్రధాన పార్టీల మధ్య ఎత్తులకు పై ఎత్తులు రసవత్తరంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్నో పనులు చేశామని, ప్రజల ఆశీర్వాదం తమకు ఉందని అధికార కాంగ్రెస్ ధీమాతో ఉంటే.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ఎటాక్ చేస్తోంది. అయితే బీఆర్ఎస్ (BRS) ఆరోపణల వెనుక కుట్ర రాజకీయం ఉందని తమ పని ముగిసిందనే భయంతోనే కేసీఆర్ మళ్లీ తెరపైకి సెంటిమెంట్ రాజకీయాలు తీసుకువస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య తెలంగాణ సెంటిమెంట్ అంశం ప్రధానాస్త్రంగా మారిన వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఆ వాదానికి పరిమితి:టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాదంతో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితిగా మారిందని అన్నారు. ఎందుకంటే ఆ భావజాలానికి ఒక పరిమిత కాలం ఉందని అందుకే దాని వ్యవస్థాపకులు భారత రాష్ట్రసమితిగా మార్చుకున్నారని కామెంట్స్ చేశారు. నిన్న విశాఖపట్నంలో జరిగిన జనసేన (Janasena) ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రస్తానాన్ని చెప్పుకొచ్చిన పవన్… జనసేన భవిష్యత్ పై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని ప్రస్తావించిన ఆయన తెలంగాణ భావజాలం పరిమితి కాలం చెల్లిందని అందువల్లే పేరు మార్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చిందన్నారు. మరింత మెరుగుపడటానికి మార్పు అనివార్యం అని చెప్పారు.

సెంటిమెంట్ వ్యూహంలో పై చేయి ఎవరిదో?:

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇలా ఉంటే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సెంటిమెంట్ పొలిటికల్ సీజన్ కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ను ఇక పూర్తిగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తుంటే కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తీసుకువస్తున్నారనే విమర్శలు కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే బకనచర్లతో పాటు ప్రతి అంశాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ముడిపెట్టడం వెనుక కేసీఆర్ కుట్ర ఇదేనంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ఆరోపణలపై స్పందిస్తున్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చినప్పుడే ఆ పార్టీకి తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని రాజకీయంగా పునర్జీవం కోసమే బీఆర్ఎస్ సెంటిమెంట్ అంశాన్ని ఎత్తుకుంటోందనే గతంలో అనేక సందర్భాల్లో విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ సెంటిమెంట్ తో బంధించాలని చూస్తున్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఎలా చెక్ పెట్టబోతున్నది అనేది రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తేలనుంది.

Next Story