ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల వేళ బోర్డు కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల వేళ బోర్డు కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ విద్యార్థులకు వచ్చే నెలలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పరీక్షలు ఎదుర్కొనేందుకు టిప్స్ అందించనున్నట్లు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి వారిలో కాన్ఫిడెంట్ పెంచేలా ఆన్ లైన్ క్లాసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యూట్యూబ్ ద్వారా వీడియో లెస్సన్స్ అందించనున్నారు. విద్యార్థుల్లో టెన్షన్‌ను తగ్గించి పరీక్షలకు మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యేలా సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ కు ఆదేశించారు. విద్యార్థులు ఈ క్లాసులను 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ-లర్నింగ్ తెలంగాణ' అనే చానల్ ద్వారా వీక్షించవచ్చని స్పష్టంచేశారు.

Also Read...

రేపటి నుంచి 'ఫార్ములా ఈ-రేసింగ్'.. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ సర్కార్!

Advertisement
Next Story

Most Viewed