బ్రేకింగ్ న్యూస్.. మునుగోడుపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ చూసి కేసీఆర్, కేటీఆర్ షాక్

by Dishanational1 |
బ్రేకింగ్ న్యూస్.. మునుగోడుపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ చూసి కేసీఆర్, కేటీఆర్ షాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడులోని ఓటర్ల నాడీ తెలుసుకునేందుకు గులాబీ పార్టీ పలు ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తున్నది. ప్రతి రోజూ రిపోర్టు తెప్పించుకుంటున్నది. రాత్రి వాటిని విశ్లేషిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నది. వీటితోపాటు మూడ్రోజులకు ఒకసారి ఇంటెలిజెన్స్ రిపోర్టు వస్తున్నది. నియోజకవర్గంలో ఇంకా మూడు మండలాల్లో పార్టీ వీక్ గా ఉందని, పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

నియోజకవర్గంలో ఆరు ప్రైవేటు ఏజెన్సీలతో టీఆర్ఎస్ సర్వే చేయిస్తున్నది. ప్రతిరోజూ ఒక రిపోర్టును తెప్పించుకుంటున్నది. ఏ మండలంలోని, ఏ గ్రామంలో పార్టీ బలహీనంగా ఉంది? ప్రజల సమస్యలేమిటి? ఏ హామీలు ఇవ్వాలి? అనుకూలంగా ఎలా మల్చుకోవాలి? అనే దానిపై సమీక్షిస్తున్నది. వివిధ ప్రాజెక్టులు, పరిహారం, పనులు, పథకాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వీటిని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రతిరోజూ రాత్రి సమీక్షిస్తూ, సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ఈ బైపోల్ లో నేతల పనితీరును కూడా పరిగణనలోకి తీసుకుంటామని హింట్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా బైపోల్ కు సంబంధించిన వివరాలను ఇంటెలిజెన్స్ కూడా సేకరిస్తుంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను నివేదిక రూపంలో తయారు చేస్తున్నది. బుధవారం అందజేసిన నివేదికలో మూడు మండలాల్లో పార్టీ వీక్ గా ఉందని పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో కాంగ్రెస్ కు పట్టుండగా, కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్ మండలం సైతం టీఆర్ఎస్ వీక్ ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో అధిష్టానం యూనిట్ ఇన్ చార్జిలకు పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed