సిరిసిల్లలో కేటీఆర్ కు ఘోర అవమానం !

by velandi.Saikiran |

గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు (KTR) ఘోర అవమానం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో (

సిరిసిల్లలో కేటీఆర్ కు ఘోర అవమానం !
X

దిశ, వెబ్ డెస్క్: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు (KTR) ఘోర అవమానం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ( Siricilla)... కేటీఆర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఫోటో లేకుండానే.. ప్రభుత్వ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో లేకుండా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అధికారులు. మొదట కేటీఆర్ ఫోటోతో ( KTR Photo) కూడిన... ఫ్లెక్సీ ని ( Flexi) ఏర్పాటు చేసి అనంతరం.. తొలగించారని తెలుస్తోంది.

సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు.. కేటీఆర్ ఫోటో తో ఉన్న ఫ్లెక్సీలు... స్థానిక అధికారులు తొలగించారని గులాబీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల ( Rajanna Siricilla) కేంద్రంలోని అపేరల్ పార్కులో ( Apparel Park)... టెక్స్ పోర్టు యూనిట్ ను (Export unit) ఇవాళ తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించేందుకు వచ్చారు.

అయితే.. ముగ్గురు మంత్రులతో కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మొదట కేటీఆర్ ఫోటోను కూడా.. ప్రభుత్వ ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో కేటీఆర్ ఫోటోను వేశారు. కానీ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేటీఆర్ ఫోటో తో ఉన్న ఫ్లెక్సీని తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులపై గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే అపేరల్ పార్కు ఏర్పాటు జరిగిందని... అలాంటిది ఆయన ఫోటో తీసేస్తారా ?అంటూ నేతలు నిరసన తెలుపుతున్నారు.

Next Story