ఉగ్రదాడిని ఖండించిన భారత్ సమ్మిట్

by Muthe.Rajitha |

పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పై భారత్ సమ్మిట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఉగ్రదాడిని ఖండించిన భారత్ సమ్మిట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పై భారత్ సమ్మిట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో శుక్రవారం ప్రారంభమైన సదస్సులో పాల్గొన్న వంద దేశాలకు చెందిన ప్రగతిశీల పార్టీలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘’పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పట్ల మేం తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఉగ్ర దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. భారత ప్రజలకు మేం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. శాంతియుత పౌరులపై ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదు. ఈ క్రూర దాడులు ఐక్యత, శాంతి, సామరస్యం అనే రాజ్యాంగ విలువలపై చేసిన ప్రత్యక్ష దాడి’’ అని పేర్కొన్నారు.

Next Story