ఒక్క ఓటు తేడాతో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

by Muthe.Rajitha |

తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీలకు రెండవ విడత ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఒక్క ఓటు తేడాతో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీలకు రెండవ విడత ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉత్కంఠభరిత ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్క కూడా ఫలితాలను నిర్దారిస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం పొతంగల్ ఖుర్ద్ గ్రామ పంచాయితీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ఒక్క ఓటు తేడాతో విజయం సొంతం చేసుకున్నారు. సంతోష్ కు 278 ఓట్లు రాగా.. అతని ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. దీంతో సంతోష్ ను సర్పంచ్ పదవి వరించింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాత రెడ్డిగూడెంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఉమ్మల వెంకట రమణ 2 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Next Story