- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. ఫోక్సో కేసు నమోదు
by Sathputhe Rajesh |
బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

X
దిశ, భీమదేవరపల్లి: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో చోటు చేసుకుంది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై సోమవారం ఫోక్సో కేసు నమోదు చేసినట్లు వంగర ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ పంచాయతీ పరిధిలోని ఓ బాలిక ఆదివారం సాయంత్రం దుకాణానికి వెళ్తుండగా గోనెల సురేష్ (22) బైక్‌పై వచ్చి అసభ్యంగా ప్రవర్తించగా ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story






