సైబర్ సెక్యూరిటీ కోర్సులకు పెరిగిన క్రేజ్.. ఆసక్తి చూపుతున్న యువత

by Kema Shiva Kumar |

ఇంజినీరింగ్ విద్యా విధానంలో వస్తున్న కొత్త కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తుంటారు.

సైబర్ సెక్యూరిటీ కోర్సులకు పెరిగిన క్రేజ్.. ఆసక్తి చూపుతున్న యువత
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంజినీరింగ్ విద్యా విధానంలో వస్తున్న కొత్త కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోర్సులలో కంప్యూటర్ కోర్సు కొత్త విధానానికి తెరలేపింది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ట్రెండ్ నడుస్తున్నది. అలాగే సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ అయ్యేందుకు కూడా యువత మొగ్గు చూపుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ ఈ కోర్సు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సులలో సైబర్ సెక్యూరిటీ కోర్సును గత సంవత్సరం ప్రవేశ పెట్టారు. సైబర్ సెక్యూరిటీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అనే రెండు కోర్సులను రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు అందిస్తున్నది. ఈ రెండు కోర్సులకు సంబంధించి 2025 సంవత్సరంలో 2,038 సీట్లను కేటాయించింది. 2025 ఇంజనీరింగ్ కోర్సులలో సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీకి 177 సీట్లు కేటాయించింది. సైబర్ సెక్యూరిటీకి 1861 సీట్లు కేటాయించింది. మొత్తంగా 1945 సీట్లు అలాట్మెంట్ అయ్యాయి. సైబర్ సెక్యూరిటీ కోర్సుకు 97.31శాతం సీట్లు కేటాయించారు.

సైబర్ సెక్యూరిటీ కోర్సుకు పెరుగుతున్న ఆదరణ

సైబర్ సెక్యూరిటీ కోర్సుకు గతంలో కంటే ఆదరణ పెరుగుతున్నది. ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సులో అడ్మిషన్లు మరింతగా పెరిగాయి. ఈ కోర్సులలో అడ్మిషన్లు పెరగడంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలలో సైబర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పోలీస్ స్టేషనలలో నమోదవుతున్న 100 ఫిర్యాదులో 85శాతం సైబర్ క్రైమ్ ఫిర్యాదులే ఉంటున్నాయి. సైబర్ క్రైమ్ అంటే కేవలం అన్లైన్ మోసాలకు గురై, డబ్బు పోగొట్టుకోవడం ఒకటే కాదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెబుతోంది. అన్లైన్ విధానం ద్వారా వేధించడం, అశ్లీల బీడియోలను సోషల్ మీడియాలో పంపడం, ఛైల్డ్ ఫోర్నోగ్రఫీ వంటివి కూడా సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ కూడా సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ప్రత్యేకంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసింది. సైబర్ నేరాల కేసులను నమోదు చేయడం , కేసుల దర్యాప్తు, బాధితులు నష్ట పోయిన డబ్బును రిఫండ్ చేయడం మొదలైనవి సైబర్ సెక్యూరిటీ బ్యూరో విధులు.

సైబర్ చట్టాలపై అవగాహన అవసరం

సైబర్ నేరాలపై విద్యార్ధి దశ నుంచే అవగాహన కలిగిఉండాలని పోలీస్ శాఖ చెబుతోంది. డిజిటల్ యుగంలో నేరాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. అదే విధంగా సైబర్ చట్టాలపై అవగాహన కలిగి ఉండటం భవిష్యత్తుకు మంచిదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెబుతోంది. 18 ఏళ్ల యువతుల సంరక్షణకు ఫోక్సో యాక్ట్ ను తీసుకువచ్చారు. ఇటువంటి చట్టాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన ఉండటం అత్యవసరమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. లైంగిక, అసభ్యకరమైన అంశాలను ప్రచురించడం, లేదా ప్రసారం చేయడం, బెదిరింపులకు పాల్పడడం, వేధించడం లాంటి నేరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడ్డుకుంటుంది.

Next Story