- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమల్లోకి పెంచిన బస్సు చార్జీలు.. సామాన్యులపై రూ.2.4 కోట్ల అదనపు భారం
ట్విన్ సిటీస్ (Twin Cities) పరిధిలో బస్సు చార్జీలను పెంచుతున్నట్లుగా ఇప్పటికే టీజీ ఆర్టీసీ (TG RTC) ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ట్విన్ సిటీస్ (Twin Cities) పరిధిలో బస్సు చార్జీలను పెంచుతున్నట్లుగా ఇప్పటికే టీజీ ఆర్టీసీ (TG RTC) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన బస్సు చార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చేశాయి. మెట్రో డీలక్స్ (Metro Deluxe), ఈ-మెట్రో ఏసీ (E-Metro AC) బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 పెంచారు. దీంతో ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.2.4 కోట్ల ఆదనపు ఆదాయం సమకూరనుంది. ఆర్డీనరీ బస్సులో కనిష్టంగా రూ.15 చార్జీ ఉండగా.. గరిష్టంగా రూ.50లగా ఉంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో కనిష్టంగా రూ.15 చార్జీ ఉండగా.. గరిష్టంగా రూ.60గా ఉంది. ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌లో కనిష్టంగా రూ.15 చార్జీ ఉండా.. గరిష్టంగా రూ.70గా ఉంది. ఈ-మెట్రో ఎసీ బస్సుల్లో కనిష్టంగా రూ.20 చార్జీ ఉండగా.. గరిష్ట చార్జీ రూ.90కి చేరింది. జంట నగరాల్లో 2,931 బస్సులు ఉండగా.. రోజుకు 31,815 టిప్పులు నడుస్తున్నాయి. మొత్తం 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో 70 శాతం అంటే18 లక్షల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అన్ని రకాల బస్సు పాస్ వినియోగదారులు 2.7 లక్షల మంది ఉన్నారు.






