రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ విద్యుత్​ వినియోగం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ఈ యాసంగికి వ్యవసాయ విద్యుత్​ వినియోగం భారీగా పెరిగింది.

రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ విద్యుత్​ వినియోగం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈ యాసంగికి వ్యవసాయ విద్యుత్​ వినియోగం భారీగా పెరిగింది. అన్నదాతలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్​ ఇవ్వడం ఒకటైతే మరో వైపు రైతులు భారీగా విద్యుత్​ను వినియోగిస్తుండడంతో కరెంటు వాడకం ఒక్క సారిగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం , ఇతర కూరగాలయ పంటల సాగు కు విద్యుత్​వాడకం పెరగడంతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 29 లక్షలకు పైగానే వ్యవసాయ కరెంటు కనెన్షన్లు ఉండగా, ఈ ఏడాది వానా కాలంలో వర్షాలు పడి చెరువులు, బావులు, బోర్లలో నీరు ఉండడంతో ఈ యాసంగి పంటల సాగు తులు మరింతగా పుంజుకుంటోంది. అదే సమయంలో ఈ యాసంగికి విద్యుత్​వినియోగం కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. ఒక్క పంపు సెట్ల వాడకాన్నే పరిశీలిస్తే.. రాష్ట్రంలో మూడు నుంచి 15 ది హెచ్​పీ ల సామర్ధ్యం వరకు ఉన్న వ్యవసాయ పంపుసెట్లను ఎక్కువగా వాడుతున్నారు. ఈ యాసంగి (రబీ ) సీజన్​లో వాడే పంపుసెట్లలో 10 హెచ్​పీ కి పైన ఉన్నవే అధికంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ..రాష్ట్రంలో 10 హెచ్​పీ మోటర్లు కోటి 60 లక్షల 700 వందలు ఉంటే , 10 హెచ్​పీ పైన ఉన్నవి 92 వేల, 160 వరకు ఉన్నాయి. దీన్ని బట్టి ఈ యాసంగి సీజన్​లో ఎక్కువ వ్యవసాయ విద్యుత్​లోడ్​ఉండే వీలు ఉందని విద్యుత్​ శాఖ ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ఖరీఫ్​లో సగటున రోజుకు ఒక్కో పంపు సెట్​2.20 హెచ్​పీలు ఉంటే, అదే యాసంగిలో 4.30 హెచ్​పీలు ఉంటుందని, అన్​సీజన్​( ఏప్రిల్​‌‌‌‌‌‌- మే )లో 1.80 హెచ్​పీలు ఉంటోందని అధికారులు తెలిపారు. కాగా అటు జెన్​ కో విద్యుత్​ప్లాంట్ల లో బొగ్గు సరఫరాలో తరుచూ వస్తున్న సమస్యల వల్ల 105 ఎంయూల వరకు రావాల్సిన థర్మల్​ విద్యుత్​ఉత్పత్తి రోజుకు 75 ఎంయూలకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అన్​సీజన్​ కావడంతో పవన విద్యుత్​కుడా విద్యుత్​శాఖకు సరిపడా అందడం లేదంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర విద్యుత్​, ప్రైవేటు విద్యుత్ కలుపుకొన్నా డిమాండ్​ను చేరుకోవడానికి ఇంకా 35 నుంచి 40 ఎంయూల వరకు మార్కెట్​లో కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయని సమాచారం. ఇదంతా కూడా ఈ యాసంగి సీజన్​లో వ్యవసాయ విద్యుత్​డిమాండ్​పెరగడం వల్లే అయినా విద్యుత్​ సంస్థలు ఎక్కడా వెనక్కితగ్గకుండా ముందుకు సాగుతున్నాయి.

వరి సాగు 40 లక్షల ఎకరాల పై మాటే..

కాగా రాష్ట్రంలో ఈ యాసంగిలో ఇప్పటికే దాదాపు 40 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోందని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం 5 లక్షల ఎకరాలు ఎక్కువగానే సాగైంది. ఇందుకు ప్రధాన కారణం భూగర్భ జలాలు పెరడమేనంటున్నారు. ఈ భూగర్భ జలాలు పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 29 లక్షల వరకు బోర్లు నడుస్తున్నాయని, ఇవి కాలువల ద్వారా వచ్చే నీటి కంటే కూడా ఈ బోర్లు అత్యధికంగా నీటిని పంపింగ్​చేస్తుండడంతో కరెంటు డిమాండ్​ రోజు రోజుకు కూడా పెరుగుతోందని విద్యుత్​శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రైతుల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు అమలు చేస్తోందని వారు గుర్తు చేస్తున్నారు.

మొన్నటి వరకు రూ.2 లక్ష మేర ఉన్న రుణాన్ని మాఫీ చేసి.. రైతుల ముఖాల్లో సంతోషాన్ని తీసుకొచ్చిన సర్కారు విద్యుత్ సరఫరాకు ఎలాంటి లోటు రాకుండా నిరంతరం సమీక్ష సమావేశాలను పెట్టిస్తోంది. ఇప్పటికే సాగుకోసం వినియోగించే కరెంటు బిల్లులను రైతులు కట్టుకోవాల్సిన అవసరం లేక పోవడం, వ్యవసాయ యాంత్రీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిపోయిన సబ్సిడీ వ్యవసాయ యంత్రాల పంపిణీ పథకాన్ని మళ్లీ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన ఇప్పడు తెలంగాణ రైతుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఉచిత విద్యుత్ ద్వారా పంట దిగుబడి పెంచేలా అన్నదాతలకు అధునాతమైన యంత్ర పరికరాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ యాసంగి పంట కాలం నుంచే రైతులకు 50 శాతం రాయితీపై వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయాలని భావిస్తోంది. కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో రైతులు పంట దిగుబడిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించినట్టు సమాచారం.

కాంగ్రెస్ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని నిర్ణయించగా.. ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 26 కోట్లు కేటాయించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.20 కోట్లు మంజూరు చేసింది. అంతే కాకుండా నేరుగా వ్యవసాయ శాఖ నుంచే పరికరాలు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అటు పంటలకు, ఇటు బోర్ల వినియోగానికి ఇలా రైతాంగం వివిధ రకాలుగా విద్యుత్​వాడకం భారీగా పెంచుకుంటూ వెళుతుండడంతో ఈ జనవరి నెలలోనే విద్యుత్​వాడకం గణనీయంగా నమోదవుతోందని డిస్కం అధికారులు తెలిపారు. ఈ నెలలోనే అత్యధిక డిమాండ్​ నమోదు అవడమే కాకుండా రోజు వారీ విద్యుత్​వినియోగం కూడా భారీగా పెరుగిపోతోందని చెబుతున్నారు. చలి నేపథ్యంలో అత్యధిక ఉష్ఞోగ్రతలు నమోదు అవుతున్నప్పటికీ కూడా ఈ సారి యాసంగి లో వరి సాగు పెరగడంతో రాష్ట్రంలో కరెంటు వాడకం కూడా అదే స్థాయిలో పెరిగిందని అధికారులు వెల్లడించారు. కాగా మరో రెండు నెలల్లో మార్చి లోనే 15 వేల మెగావాట్లు విద్యుత్​ డిమాండ్​దాటనున్నట్లు అధికారులు అంచనా వేస్తుండడం విశేషం.

Next Story