- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో 14 వార్డుల్లో ఏకగ్రీవం.. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 2 వార్డులు కైవసం
by Kema Shiva Kumar |
మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ మరుసటి రోజే ఏకగ్రీవాలకు తెరలేచింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ మరుసటి రోజే ఏకగ్రీవాలకు తెరలేచింది. రాష్ట్రంలోని 9 మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లలోని 14 వార్డులలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీటికి సంబంధించిన జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. ఈ 14 వార్డులలో 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ రెండు వార్డులను దక్కించుకుంది.
అయితే, వికారాబాద్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థి పి. విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డు ఏకగ్రీవం కావడం వివాదాస్పదంగా మారింది. కోదాడ మున్సిపాలిటీలోని మూడు వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
Next Story






