Jubilee Hills: మేమేంటో అప్పుడు చూస్తారు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Prasad Jukanti |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Jubilee Hills:  మేమేంటో అప్పుడు  చూస్తారు..  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ రాష్ట్ర సమీకరణాలు ఆసక్తిని రేపుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆ పార్టీకి జై కొట్టిన ఎంఐఎం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) కాంగ్రెస్‍కు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఆపార్టీ కోరుతోంది. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ పై, జూబ్లీహిల్స్ లో పార్టీ పరిస్థితిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ప్రభుత్వం మారదు, కొత్త ప్రభుత్వం రాదన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్‍కు 10 ఏళ్లు అధికారం ఇచ్చారు. కానీ అక్కడ ఏ వార్డులోను అభివృద్ధి జరగలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ కు ఓటు వేయాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అలాగే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఎంఐఏం చేయబోతోందో మీరంతా చూస్తారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే హైదరాబాద్ మేయర్ పీఠం కోసమే జూబ్లీహిల్స్ బరిలో నుంచి మజ్లీస్ తప్పుకుందని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో 2028 ఎన్నికల్లో ఎంఐఎం ఎలాంటి స్ట్రాటజీ ఉంది అనేది స్టేట్ పాలిటిక్స్ లో ఇంట్రెస్డింగ్ గా మారింది.

Next Story