TG: రాష్ట్రంలో ఒంటిపూట బడులపై కీలక ఆదేశాలు

by Prasad Jukanti |

ఒంటిపూట బడులు, ఉర్దూ మీడియం స్కూళ్ల టైమ్ టేబుల్ మార్పు, సమ్మర్ హాలిడేస్ పై కీలక ఆదేశాలు వెలువడ్డాయి.

TG: రాష్ట్రంలో ఒంటిపూట బడులపై కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ (Telangana Education Department) ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే బడులు నడుపుతారు. 12:30 గంటల సయమంలో మధ్యాహ్న భోజనం అందజేస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొంది. స్కూల్స్ రీ ఓపెనింగ్ జూన్ 12, 2026-27లో ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఉర్దూ మీడియం పాఠశాలల తరగతుల సమయాల్లో మార్పు:

రంజాన్ సందర్భంగా పాఠశాల సమయాల్లో తెలంగాణ విద్యాశాఖ మార్పులు చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం పాఠశాలలో టైమ్ టేబుల్ చేంజ్ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైతే వారంలో ఒక రోజు అదనంగా తరగతులు నిర్వహించాలని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story