- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Traffic Challans: బలవంతంగా పెండింగ్ చలాన్ల వసూలు వద్దు: హైకోర్టు
ట్రాఫిక్ చలాన్ల విషయంలో వాహనదారులకు రిలీఫ్ కలిగేలా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంత పెట్టొద్దని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల తాళాలు లాక్కోవడం, వాహనం ఆపి అక్కడికక్కడే డబ్బులు చెల్లించాలని వాహనదారులను బలవంతం చేయకూడదని స్పష్టం చేసింది. ఒక వేళ పెండింగ్‍లోఉన్న చలాన్ల వసూలు చేయాలని పోలీసులు భావిస్తే కోర్టు నోటీసులు ఇచ్చి న్యాయప్రక్రియ ద్వారా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. పెండింగ్ చలాన్లు చెల్లించాలనుకుంటే పౌరులు తమ ఇష్టానుసారంతో స్వచ్ఛందంగా చెల్లించుకోవచ్చని తెలిపింది. ట్రాఫిక్ చలాన్ల విషయంలో నమోదైన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చింది.
Next Story






