Hydra: ఫాతిమా కాలేజీపై చర్యల విషయంలో జరుగుతున్నది ఇదే: రంగనాథ్

by Prasad Jukanti |   (  Updated:2025-08-23 07:22:53  IST  )

వందేళ్ల ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్తోందని హైడ్రా కమిషనర రంగనాథ్ అన్నారు.

Hydra: ఫాతిమా కాలేజీపై చర్యల విషయంలో జరుగుతున్నది ఇదే: రంగనాథ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వందేళ్ల ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్తోందని హైడ్రా కమిషనర రంగనాథ్ అన్నారు. ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాల్సి ఉందన్నారు. హైడ్రా ఒకటి, రెండేళ్లకు పరిమితం కాదన్నారు. ప్రారంభంలో హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. హైడ్రా ఏర్పాటులో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి ఇలాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు.

ఫాతిమా కాలేజీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాతిమా కాలేజీ 2015-16 లో నిర్మించారు. చారిటీ అనేది సెంకడరీ ఇష్యూ అన్నారు. నగరంలో 900కంటే ఎక్కువ చెరువులు ఉంటే వాటిలో అత్యధిక భాగం చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ రాలేదని అందులో సలకం చెరువు కూడా ఉందన్నారు. తాము కూల్చివేస్తే ఎవరైనా కోర్టులకు వెళ్లే అవకాశం ఉందని అందువల్ల చెరువుల హద్దుల విషయంలో శాస్త్రీయమైన నిర్ధారణ కోసం డేటాను కలెక్ట్ చేస్తున్నామన్నారు. ఎన్ కన్వెషన్ విషయం వేరు అని అక్కడ దుర్గం చెరువుకు 2015లోనే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిందని అందువల్లే ఇక్కడ తాము కూల్చివేశామన్నారు. ఆ కాలేజీలకు స్పెషల్ చట్టాలు ఉండవు: అందరికీ ఒకే చట్టం అమలవుతాయి తప్ప ఫాతిమా కాలేజీకి, మల్లారెడ్డి కాలేజీకి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీకి ప్రత్యేక చట్టాలు అమలు కావన్నారు. రేపు కోర్టుల్లో చాలెంజ్ చేసినా నిలబడే విధంగా తాము ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల నిర్థారణ కోసం కసరత్తు జరుగుతోందని ఈ ఏడాదిలో పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. హైడ్రా ఏర్పడే నాటికి ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ఇండ్ల విషయంలో ఎలాంటి చర్యలు ఉండవని ప్రభుత్వం ఇది వరకే స్పష్టం చేసిందన్నారు. సీఎస్ఆర్ పేరుతో చెరువులను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని సాంకేతిక ఆధారాలతో చెరువుల ఎఫ్ టీఎల్ మార్క్ చేస్తున్నామని వెల్లడించారు. చెరువుల వద్ద భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. చెరువులతో పాటు నాలాలను నోటిఫై చేస్తున్నామన్నారు.

Next Story