గోదావ‌రిలో దొంగ‌లు ప‌డ్డారు.. చీక‌ట‌యితే ఇసుక దందా షురూ

by Disha Web Desk 13 |
గోదావ‌రిలో దొంగ‌లు ప‌డ్డారు.. చీక‌ట‌యితే ఇసుక దందా షురూ
X

దిశ‌, నిఘా ప్రతినిధి: చీక‌ట‌యితే చాలు ఏటూరునాగారం ఏరియాలోని గోదావ‌రిలో దొంగ‌లు ప‌డుతున్నారు. ల‌క్షల విలువ చేసే ఇసుక‌ను అప్పనంగా త‌ర‌లించుకుపోతున్నారు. వంద‌లాది లారీల‌తో గ‌మ్యాల‌కు చేర్చుతూ డంప్ చేసుకుంటున్నారు. ఓ ప్రజాప్రతినిధికి అనుచ‌ర‌వ‌ర్గం ద‌ర్జాగా దందా సాగిస్తుండ‌టం గ‌మనార్హం. ఈ అక్రమ ఇసుక త‌వ్వకాలన్నీ కూడా చ‌త్తీస్‌గ‌డ్‌, తెలంగాణ రాష్ట్రాల‌ను క‌లిపే ముల్లక‌ట్ట బ్రిడ్జీ కింద జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.


ఇష్టారాజ్యంగా త‌వ్వకాలు జ‌రుగుతుండ‌టంతో బ్రిడ్జీకి ప్రమాద‌క‌రంగా మారాయి. ఇసుక‌ను అక్రమంగా త‌ర‌లిస్తున్న ఇసుకాసురులు వంతెన పై నుండి చూస్తే ఏవ‌రికి క‌నిపించ‌కూడ‌ద‌నే ప‌ద్దతిలో వంతెన క్రింద గ‌ల పిల్లర్ల వ‌ద్ద ఇసుక‌ను తొడుతున్నారు. దీని వ‌లన‌ ముందు ముందు పిల్లర్లకు భూబ‌లం తగ్గడంతో పిల్లర్లు బ‌లాన్ని కొల్పోయి బ్రిడ్జి ప్రమాదంలో ప‌డే అవ‌కాశం ఉంది. అనుమ‌తుల్లేకుండా త‌వ్వకాలు జ‌రుగుతున్నా, స్థానికుల నుంచి మౌఖికంగా ఫోన్లలో ఫిర్యాదులు అందినా రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్ అధికారులు క‌ళ్లప్పగించి చూస్తున్నారు త‌ప్పా, చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

అస‌లేం జ‌రుగుతోందంటే..?!

ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం ముళ్లక‌ట్ట బ్రిడ్జి, సాయి ద‌త్తా క‌న్‌స్ట్రక్షన్ స‌మీపంలోని గోదావ‌రి న‌దిలోంచి ఇసుక‌ను అక్రమంగా త‌ర‌లిస్తున్నారు. రాత్రి ఎనిమిది గంట‌ల త‌ర్వాత జేసీబీ, టిప్పర్ల సాయంతో త‌ర‌లించి సోమ్ము చేసుకుంటున్నారు. రోజు రాత్రి 12 గంట‌ల నుంచి ఉద‌యం 3 గంట‌ల వ‌ర‌కు మిష‌నరీలు, టిప్పర్‌ల‌ ద్వారా ఈ దందా జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు దిశ చేతిలో ఉన్నాయి.


మండ‌ల కేంద్రంలో మామూలుగా ఏవ‌రికైన ఇసుక కావాల‌సి వ‌స్తే ప్రభుత్వ నిబంద‌న‌ల ప్రకారం.. స్థానికి రెవిన్యూ కార్యాల‌యంలో ఇసుక ట్రాక్టర్ కోసం డీడీ తీసీ కూలీల సాయంతో ప‌గ‌టి పూట మాత్రమే ఇసుక‌ను ట్రాక్టర్ల ద్వారా త‌ర‌లించాల్సి ఉంటుంది. కానీ, నిబంద‌న‌ల‌ను తుంగ‌లో తొక్కి ముళ్లక‌ట్ట బ్రిడ్జి క్రింద రాత్రి స‌మ‌యంలో ఇసుక‌ను మిష‌నరీల సాయంతో త‌ర‌లిస్తున్నారు.

ఏటూరునాగారంలో అధికారులున్నారా..?

ముళ్లక‌ట్ట గోదావ‌రి లొంచి అక్రమంగా లారీల ద్వారా ఇసుక‌ను త‌ర‌లిస్తున్నా చీక‌టి మాఫియా ఏక్కడికి త‌ర‌లిస్తున్నార‌నే తెలియాల్సి ఉంది. ఉన్నత స‌మాచారం మేర‌కు మండ‌ల కేంద్రంలో కొన్ని ప్రాంతాల‌లో డంపు చేసుకోని రాత్రి స‌మ‌యంలో ట్రాక్టర్ల ద్వారా త‌ర‌లిస్తున్నాట్లు స‌మాచారం. కాగా, రాత్రి స‌మ‌యంలో ఇసుక‌ను తవ్వేప్పుడే మాత్రమే లారీలు, జేసీబీ మిష‌న‌రీలు ద‌ర్శన‌మిస్తున్నాయి. ప‌గ‌టి పూట మాత్రం వీటీ జాడ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రోజు రాత్రి స‌మ‌యంలో య‌దేచ్చగా ఇసుక తవ్వకాలు జ‌రుగుతున్న అ వైపు క‌న్నెత్తి చూసిన అధికారుల దాఖాలాలు లేవు. ముళ్లకట్ట గోదావ‌రిలోంచి నిత్యం అక్రమ ఇసుక దందా కోన‌సాగుతున్న అటువైపుగా మైనింగ్ శాఖ కాని రెవిన్యూ శాఖ చూసి చూడ‌కుండా వ్యవ‌హ‌రిస్తుండ‌డం ప‌ట్ల ప్రజ‌ల నుండి ప‌లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పెద్ద స్థాయి లో అధికారుల, రాజ‌కీయ నాయ‌కుల‌ అండ‌దండ‌ల‌తోనే అక్రమ ఇసుక వ్యాపారం కోన‌సాగుతున్నట్లుగా మండ‌ల ప్రజ‌ల నుండి గుస‌గుస‌లు విన‌బ‌డుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ మార్గాన ఇసుక వ్యాపారం కోన‌సాగిస్తున్న వారీపై దృష్టి సారించాల‌ని ప్రజ‌లు కొరుకుంటున్నారు.


Next Story

Most Viewed