నభా ఏంటమ్మ ఈ సెగ.. ఇస్మార్ట్ బ్యూటీ లుక్‌కు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు

by Disha Web Desk 7 |
నభా ఏంటమ్మ ఈ సెగ.. ఇస్మార్ట్ బ్యూటీ లుక్‌కు క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నభా నటేష్ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ రామ్ సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మాత్రం కుర్రాళ్లలో క్రేజీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే.. కెరీర్ ఊపందుకున్న సమయంలో ఈ అమ్మడుకి ఎక్సిడెంట్ కావడంతో సినిమాలకు దూరం అయింది. దాదాపు రెండు సంవత్సరాలు వెండితెరకు దూరం అయిన ఈ అమ్మడు.. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ఈ క్రమంలోనే ‘డార్లింగ్ (వై దిస్ కొలవెరి)’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది నభా. దీంతో పాటు నిఖిల్ ‘స్వయంభు’ మూవీలో కూడా నటిస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె.. తన అందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్కిన్ కనిపించేలా రెడ్ కలర్ డ్రెస్ ధరించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘రెబెల్ రోజ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.



Next Story

Most Viewed