- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిమ్మల్ని తరిమికొట్టకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS), ప్రభుత్వంపై మాటల దాడికి దిగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS), ప్రభుత్వంపై మాటల దాడికి దిగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా హౌస్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను ‘గొప్ప వాగ్దానాల నుంచి ఘోర వైఫల్యాల వరకు!’ ట్యాగ్ లైన్‌తో షేర్ చేస్తూ.. ఆరు గ్యారంటీ (Six Guarantees)లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ (Telangana) ఓటర్లను ‘కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను కాపాడుకోమని’ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఉద్వేగభరితంగా విజ్ఞప్తి చేసిన సంగతి గుర్తుందా అని ప్రశ్నించారు.
ప్రతి ఒక్క వాగ్ధానాన్ని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చారని ఆరోపించారు. కానీ, రెండేళ్లు అధికారం తర్వాత అన్ని వాగ్ధానాలు నేరవేర్చామని చెబుతున్నాని ఫైర్ అయ్యారు. భట్టి గారు.. తెలంగాణలో ఏ గ్రామంలోనైనా వెళ్లి అదే మాట ప్రజలతో చెప్పగలరా అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికే, అబద్ధాలు ఆడిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు చీకొడుతున్నారని కామెంట్ చేశారు. మీరు, కేబినెట్ మంత్రులు, తెలంగాణలో ఏ గ్రామంలోనైనా వెళ్లి.. ఆరు గ్యారంటీలను దాదాపు అన్నింటినీ నెరవేర్చామని చెప్పే దమ్ముందా అని అన్నారు. ఒకవేళ అలా చెబితే.. ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టకపోతే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ ట్వీట్ చేశారు.






