- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ నిజాయితీపరుడైతే కోర్టుకు వెళ్లడు.. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజాయితీపరుడైతే ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కోర్టుకు వెళ్లడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సెటైర్లు వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజాయితీపరుడైతే ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కోర్టుకు వెళ్లడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇవాళ గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌ను తన ఫ్రెండ్ కిషన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌పై గవర్నర్ విచారణకు అనుమతినిచ్చిన నేపథ్యంలో కేసులో A1, A2లపై జాయింట్ ఛార్జిషీటు వేయాల్సి ఉంటుందని అన్నారు. కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారని.. ఆయనను విచారించాలంటే DoPT నుంచి అనుమతి రావాలన్నారు.
మొన్నటి వరకు కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా గప్పాలు కొట్టాడని కామెంట్ చేశారు. లొట్టపీసు కేసే అయితే కేటీఆర్ కోర్టుకు వెళ్లకుండా విచారణకు సహకరించాలన్నారు. అడ్డగోలుగా దోచుకొని విచారణకు రమ్మంటే ప్రభుత్వాన్ని నిందిస్తారా.. అంటూ ఫైర్ అయ్యారు. కక్ష రాజకీయాలు చేయాలంటే ప్రభుత్వం ఏర్పడగానే కేటీఆర్‌ను జైల్లో వేసేవాళ్లమని అన్నారు. గత ప్రభుత్వ తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. కేటీఆర్ ఎప్పుడు జైలుకెళ్తాడా.. పార్టీ పగ్గాలు తన చేతికి ఎప్పుడు వస్తాయా అని హరీశ్ రావు చూస్తున్నాడని అన్నారు. కేటీఆర్ అరెస్టు ఆగడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని ఆరోపించారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసిందని.. 2 నెలలు గడుస్తున్నా విచారణను ప్రారంభించలేదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు.






