- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madhu Yaskhi Goud: కేసీఆర్‌ను అరెస్ట్ చేయకుంటే.. కాంగ్రెస్‌కూ బీఆర్ఎస్ గతే.. సొంత పార్టీపై మధుయాష్కీ గౌడ్ హాట్ కామెంట్స్
కేసీఆర్, కేటీఆర్ ను అరెస్టు చేయకపోతే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని సొంత పార్టీపై మధుయాష్కీ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ను అరెస్టు చేయకుంటే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhuyashki Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో ఇంజినీర్లను అరెస్టు చేసి శిక్షించినంత మాత్రాన సరిపోదని వారికి ఆదేశాలిచ్చిన మంత్రి, ముఖ్యమంత్రిని శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై జలసాధన సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మధుయాష్కీ గౌడ్ పాల్గొని మాట్లాడారు. నీళ్లు, నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని పదేళ్ల కేసీఆర్ పాలన అవినీతియే లక్ష్యంగా సాగిందని విమర్శించారు.
ఆ బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఏడాదిన్నర పూర్తయింది. మరో మూడున్నరేళ్ల పదవీ కాలం ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ అవినీతిపై రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఉన్నందున గత ప్రభుత్వం అవినీతిని బయటకు తీయాల్సిన సామాజిక బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ఉందని మధుయాష్కి అన్నారు. ఈ విషయాన్ని మా ప్రభుత్వానికి గుర్తు చేయడానికి గతంలో వెనుకాడలేదని ఇప్పుడు వెనకాడబోనన్నారు. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానని చెప్పారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు నిపుణులను తీసుకెళ్లి చేపట్టాల్సిన చర్యలపై చర్చిద్దామన్నారు. తనకు పార్టీ పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నారు. రిపోర్టులు ఇచ్చి కాలయాపన చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే మా ప్రభుత్వానికి పడుతుందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి విజయ రామారావు, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్, ఇంజనీరింగ్ నిపుణులు తదితరులు హాజరయ్యారు.






