- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రణరంగంలా ఇబ్రహీంపట్నం.. కుర్చీలను విసురుకున్న కౌన్సిలర్లు
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ హాల్ రణరంగంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య చెలరేగిన వివాదం భౌతిక దాడులకు దారితీసింది.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ (Ibrahimpatnam Municipality)లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య పోటాపోటీ నెలకొనడంతో ఎన్నికను నేటికి వాయిదా వేశారు.
ఈ క్రమంలోనే కాసేపటి క్రితమే ఇరు పార్టీల కౌన్సిలర్లు (Councilors) భారీ ఎత్తున కౌన్సిల్ హాలుకు చేరుకున్నారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సభను హోరెత్తించారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు కౌన్సిలర్లు కౌన్సిల్ హాలులోని కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. దీంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గొడవను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం ఎదుట, లోపల భారీగా పోలీసులను మోహరించారు.






