- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగోరోజు పూర్తయిన ఐబొమ్మ రవి కస్టడీ.. సమాధానాలతో ఖంగుతిన్న పోలీసులు
నాలుగో రోజు ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది. షరామామూలుగా ఈరోజు కూడా రవి పోలీసులకు సహకరించకుండా బొమ్మ బొరుసు ఆడుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: నాలుగో రోజు ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది. షరామామూలుగా ఈరోజు కూడా రవి పోలీసులకు సహకరించకుండా బొమ్మ బొరుసు ఆడుకున్నాడు. ఏం అడిగినా.. గుర్తులేదు, మర్చిపోయానని ఇచ్చిన సమాధానాలతో పోలీసులు ఖంగుతిన్నారు. దీంతో రవి బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డుల వివరాలను సీసీఎస్ పోలీసులు పలు బ్యాంకులకు మెయిల్స్ చేశారు. తానొక్కడినే ఇదంతా చేసినట్లు రవి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే థియేటర్లలో విడుదలైన సినిమాలను పైరసీ చేసినట్లు చెప్పాడు. సొంతంగా వెబ్ సైట్ క్రియేట్ చేశానని, ఇందులో ఎవరికి ఎలాంటి సంబధం లేదని తెలిపాడు. సినిమాల పైరసీ కేసులో మరో ఐదుగురు అరెస్టైన నేపథ్యంలో రవి అలర్టై.. అదేరోజున నెదర్లాండ్స్ వెళ్లినట్లు విచారణలో వెల్లడయింది.
రవి వద్ద ఉన్న హార్డ్ డిస్కుల్లో సినిమాలు మినహా మిగతా డేటా మొత్తాన్నీ డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న డబ్బును కూడా పలు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు. సర్వర్, వెబ్ సైట్ వివరాలను మాయం చేసి, పోలీసులకు ఎలాంటి క్లూ దొరక్కుండా చేశాడు. తన అరెస్టును ముందే పసిగట్టి ఇదంతా చేసినట్లు కస్టడీలో చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. రవి కస్టడీ ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోగా రవి నుంచి డేటా సేకరించి, నేరానికి రుజువులు రాబట్టాల్సి ఉంది. సినిమాల పైరసీ, మనీలాండరింగ్ ప్రూవ్ అయితే గానీ.. అతనిపై చట్టపరమైన చర్యలకు ఆస్కారం లేదని తెలుస్తోంది.






