ఐబొమ్మ రవి యాటిట్యూడ్.. మీడియాపై దురుసు ప్రవర్తన

by Gantepaka Srikanth |

ఐబొమ్మ రవి యాటిట్యూడ్.. మీడియాపై దురుసు ప్రవర్తన

ఐబొమ్మ రవి యాటిట్యూడ్.. మీడియాపై దురుసు ప్రవర్తన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ వెబ్‌సైట్(ibomma Website) నిర్వహకుడు ఇమ్మది రవి(ibomma Ravi) కస్టడీ ముగిసింది. మొత్తం 12 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు(Cybercrime Police) రవిని విచారించారు. ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున మూడు కేసుల్లో 12 రోజుల పాటు విచారణ జరిపారు. కస్టడీలో ప్రహ్లాద్‌తో ఉన్న లింకులపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అంశాలపైనా విచారించినట్లు తెలుస్తోంది. సోమవారం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో రవిని హాజరుపర్చారు. నాంపల్లిలో కోర్టు ఆవరణలో పలువురు మీడియా ప్రతినిధులు రవిని ప్రశ్నించారు. వారి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు యాటిట్యూడ్‌తో సమాధానం ఇచ్చారు. అన్నీ ఫాల్స్ అంటూ కామెంట్స్ చేశారు. మీతో ఏం మాట్లాడేది లేదు.. అంతా కోర్టులోనే తేల్చుకుంటా అని మీడియాపై కోప్పడ్డాడు. సరైన సమయంలో వాస్తవాలు అన్నీ బయటపెడతా అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story