IAS Transfers: రాష్ట్రంలో కీలక పరిణామం.. 8 మంది ఐఏఎస్‌లు బదిలీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-21 01:23:13  IST  )

రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

IAS Transfers: రాష్ట్రంలో కీలక పరిణామం.. 8 మంది ఐఏఎస్‌లు బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొత్తం 8 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumar) గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రవాణ శాఖ కమిషనర్‌ కె.సురేంద్ర మోహన్‌ (K Surendra Mohan)‌ను సహకార శాఖ కమిషనర్‌గా, మార్కెటింగ్‌ డైరక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలను ఐఏఎస్‌ అధికారి ఉదయ్‌ కుమార్‌ (Uday Kumar) నిర్వర్తించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ (RV Karnan)కు ఆరోగ్యశ్రీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు అదే పోస్టులో కొనసాగిన శివశంకర్‌ (Shiva Shankar) జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి కె.హరిత (K Haritha)ను వాణిజ్య పన్నుల శాఖ డైరక్టర్‌గా నియమించారు. ఉద్యాన శాఖ డైరక్టర్‌ యాస్మిన్‌ బాషా (Yasmin Basha)కు సీడ్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హాకా ఎండీ కె.చంద్రశేఖర్‌ రెడ్డికి (K Chandrashekar Reddy) తెలంగాణ ఫుడ్స్‌ ఎండీగా, తెలంగాణ ఫుడ్స్‌ ఎండీగా ఉన్న బి.శ్రీనివాస రెడ్డి (B Srinivas Reddy) ని ఆయన మాతృ శాఖ చేనేత జౌళి శాఖకు బదిలీ చేశారు. వనపర్తి అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) సంచిత్‌ గాంగ్వార్‌ (Sanchith Gangwar)ను నారాయణపేట అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)గా నియమించారు.

Next Story