- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Singareni:సింగరేణి కొత్త సీఎండీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్
సింగరేణి సీఎండీ బలరామ్ స్థానంలో కొత్త సీఎండీ వచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి ఇన్‍చార్జి సీఎండీగా ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్‍ను (Singareni CMD IAS Krishna Bhaskar) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ (N Balram) డిప్యూటేషన్ పూర్తి కావడంతో ఆయన కేంద్ర సర్వీసులోకి వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో కృష్ణభాస్కర్‍ను ఇన్ చార్జి సీఎండీగా ప్రభుత్వం నియమించింది. కేంద్ర రెవెన్యూ సర్వీసుల నుంచి డిప్యూటేషన్‍పై తెలంగాణకు వచ్చిన బలరామ్.. సింగరేణిలో సంచాలకుడిగా ఇన్ చార్జీ సీఎండీగా ఆరేళ్లపాటు పని చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చిన అధికారులకు డిప్యూటేషన్ గడువు సాధారణంగా ఐదేళ్లే ఉంటుంది. అంతకు మించి ఏడాది అదనంగా ఉన్నందున మరోసారి బలరామ్ గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదు. ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని రెగ్యులర్ సీఎండీని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం రెగ్యులర్ సీఎండీని కాకుండా ఇన్ చార్జి సీఎండీని నియమించింది.






