ప్రతి వీధిలో కడియం దిష్టిబొమ్మను వేళాడదీస్తా.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) చరిత్ర హీనుడిలా వివరణ ఇచ్చారని బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండి రాజయ్య (Thatikonda Rajaiah) ఫైర్ అయ్యారు.

ప్రతి వీధిలో కడియం దిష్టిబొమ్మను వేళాడదీస్తా.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) చరిత్ర హీనుడిలా వివరణ ఇచ్చారని బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండి రాజయ్య (Thatikonda Rajaiah) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్నా అని.. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానంటూ కడియం డైలాగులు కొట్టలేదా అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ (BRS) పార్టీకి చేసిన కీడుకు మందు ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా కడియం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేని పక్షంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజవర్గ పరిధిలోని ప్రతి వీధిలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మలను వేళాడదీస్తామని అన్నారు. ఇక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను కాంగ్రెస్‌లో చేరనేలేదు.. కడియం శ్రీహరి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులపై తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించిన విషయం తెలిసిందే. స్పీకర్‌ నోటీసులపై బుధవారం లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరలేదని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ సభ్యతం రద్దుచేసుకోలేదు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని తాను తాను ఎక్కడ కూడా ప్రకటించలేదు అని వివరణ ఇ్చారు.కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు అని చెప్పుకొచ్చారు. అయితే, కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కడియం శ్రీహరి ఆవేన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి

Next Story