కష్టపడే వారికి చేయూత అందిస్తా

by Taduka Kalyani |

కష్టపడి పని చేసుకునే వారికి ఎల్లప్పుడూ నా సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

కష్టపడే వారికి చేయూత అందిస్తా
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కష్టపడి పని చేసుకునే వారికి ఎల్లప్పుడూ నా సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో హోటల్ నడుపు కొంటూ ఉపాధి పొందుతున్న వారికి నెక్ సహకారంతో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రూ.71 లక్షల విలువ గల 91 టీ స్టాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మీ కష్టానికి నా వంతుగా ఉడుతా భక్తి గా ఈ స్టాల్స్ అందిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది బండి మీద మీరు హోటల్ పెట్టుకొని.. కొంతమంది రోడ్డు మీద పెట్టుకొని ఉండే వాళ్లకు స్థాల్ ఉండాలనే ఉద్దేశ్యంతో సహకారం ఇస్తున్నట్లు చెప్పారు. కష్టపడే వారికి చేయూత.. ప్రోత్సాహం అందించే విషయంలో నా సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. టీ స్టాల్ వ్యాపారమే కాదు.. మీ కాళ్ల మీద మీరు నిలబడి మీ కుటుంబానికి జీవన దారమని చెప్పారు. కష్టపడి పని చేసే వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గమని, నిజాయితీ గా చేసే వ్యాపారం విజయానికి పునాది అవుతుందన్నారు. వ్యాపారం మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టి స్టాల్స్ తో సామాగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story