Kavitha : మాకు కూడా టైం వస్తుంది.. అప్పుడు అందరి సంగతి చెప్తాం: కవిత

by Y. Venkata Narasimha Reddy |

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) బీఆర్ఎస్(BRS) కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని...పింక్ బుక్‌లో అందరి చిట్టా రాసుకుంటామని..మాకు కూడా టైం వస్తుందని.. అప్పుడు అందరి సంగతి చెప్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.

Kavitha : మాకు కూడా టైం వస్తుంది.. అప్పుడు అందరి సంగతి చెప్తాం: కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy Government) బీఆర్ఎస్(BRS) కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని...పింక్ బుక్‌లో అందరి చిట్టా రాసుకుంటామని..మాకు కూడా టైం వస్తుందని.. అప్పుడు అందరి సంగతి చెప్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో కవిత మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నానని.. ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటేన్ చేస్తామని..బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారని..చిన్న విమర్శ చేసినా, ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం లేదని, కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

తన మీటింగు కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై జూపల్లి దాడి చేయించారని..ఇదేమి రాజ్యం? కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని కవిత ప్రశ్నించారు. టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజక వర్గానికి టూరిస్ట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తున్నారన్నారు. ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ అని చెప్పి బోగస్ చేసిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదన్నారు.

Next Story