- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గచ్చిబౌలిలో హైడ్రాకు షాక్.. ఆ ప్లాట్లు తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు..
అక్రమార్కులకు సింహస్వప్నంలా మారిన హైడ్రా కొందరిని మాత్రమే హడలెత్తిస్తుందని, ఇంకొందరు హైడ్రా అంటే డోంట్ కేర్ అంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, శేరిలింగంపల్లి : అక్రమార్కులకు సింహస్వప్నంలా మారిన హైడ్రా కొందరిని మాత్రమే హడలెత్తిస్తుందని, ఇంకొందరు హైడ్రా అంటే డోంట్ కేర్ అంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గచ్చిబౌలి సర్వే నెంబర్ 124, 127లలోని సుమారు 20 ఎకరాలలో గతంలో ఫర్టిలైజర్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లే అవుట్ వేసింది. ఈ లే అవుట్ లో 162 మంది ప్లాట్స్ కొనుగోలు చేశారు. సంధ్యా కన్వెషన్ వారు తమ సొసైటీ లే ఔట్ లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు గతంలో హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇది వరకు ఉన్న లేఅవుట్ ను నామరూపాలు లేకుండా చేసి రోడ్స్, పార్క్స్ ను కలుపుతూ సంధ్యా కన్స్ట్రక్షన్ పలు ఆక్రమణలు చేపట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైడ్రా సిబ్బంది గత నెల 5న అనుమతులు లేని కట్టడాలను తొలగింపు పనులను చేపట్టింది. సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు వంటగదులు, రెస్ట్ రూమ్ లను తొలగించారు. లేఅవుట్ ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్, జీ ప్లస్ 2గా నిర్మించిన 3 ఐరన్ షెడ్ లను సైతం తొలగించారు.
దీనిపై సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అయితే మంగళవారం హైడ్రా అధికారులు గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ సొసైటీలో సర్వే చేపట్టారు. లేఔట్ లోని రోడ్లను, ప్లాట్లను క్రమబద్ధీకరించారు. అయితే హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు క్రమబద్రీకరణ చేసిన రోడ్లను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి పూడ్చేవేశారు. ఇది ఎవరి పని అనేదానిపై హైడ్రా అధికారులు ఆరా తీస్తున్నారు.






