HYDలో మళ్లీ హైడ్రా ప్రకంపనలు.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీస్‌లు అన్నీ కూల్చివేత

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-19 12:11:23  IST  )

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో హైడ్రా(Hydraa) కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

HYDలో మళ్లీ హైడ్రా ప్రకంపనలు.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీస్‌లు అన్నీ కూల్చివేత
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో హైడ్రా(Hydraa) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హఫీజ్‌పేట్(Hafeezpet) సర్వే నెంబర్ 79లోని 20 ఎకరాల్లోని కట్టడాలను కూల్చివేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌(Vasantha Krishna Prasad)కు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన స్థలంలో ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వసంత కృష్ణ ప్రసాద్ ఇళ్లు, కార్యాలయం, షెడ్లను నేలమట్టం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జేసీబీల సహాయంతో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

దీనికి ముందు మియాపూర్(Miyapur) వరల్డ్ వన్ స్కూల్ వెనుక ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. భారీ షెడ్లను జేసీబీల సహాయంతో కూల్చివేసింది. గతంలో సంబంధిత వ్యాపారులకు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అంతేకాదు.. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 213, 214 ,215 ,216 లో స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ కట్టడాన్ని హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూల్చివేతలు జరుగుతున్నాయి.

Next Story