- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మకుంటలో హైడ్రా కమిషనర్ బోటు షికారు
బతుకమ్మకుంటను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ మంగళవారం రాత్రి సందర్శంచారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బతుకమ్మకుంటను హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ మంగళవారం రాత్రి సందర్శంచారు. ఈ నెల 26న జరగనున్న బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను నగర ప్రజలకు అంకితం ఇవ్వనున్న నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. 26 నాటికి బతుకమ్మ కుంటతో పాటు పరిసరాలు సర్వాంగ సుందరంగా మారాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు కూడా బతుకమ్మకుంటను సందర్శించి.. హైడ్రా పని తీరును ప్రసంశించారు. బతుకమ్మ కుంటను చూస్తుంటే.. ఇది కలా నిజమా అనేది అర్ధం కావడంలేదని స్థానికులు ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుని.. ఈ బాధ్యతను హైడ్రాకు అప్పజెబితే.. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసిందని కొనియాడారు. తర్వాత బతుకమ్మ కుంటలో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ బోటులో విహరించారు. హైడ్రా అడ్మిన్ ఎస్‌పీ ఆర్. సుదర్శన్ వి. హనుమంతరావు కూడా కమిషనర్‌తో పాటు విహరించినవారిలో ఉన్నారు.






