Hydraa Chief: ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాలను టచ్ చేయం

by Gantepaka Srikanth |

ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఫామ్‌హౌజ్‌లు కడితే కచ్చితంగా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

Hydraa Chief: ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాలను టచ్ చేయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఫామ్‌హౌజ్‌లు కడితే కచ్చితంగా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఫామ్‌హౌజ్ FTLలో లేదని తెలిపారు. జంగంకుంట కబ్జా వెనుక చాలా పెద్దవారు ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. అయినా వదిలిపెట్టం. మా డ్యూటీ మేము తప్పకుండా చేసి తీరుతాం. ఇక దుర్గం చెరువు విషయానికొస్తే.. హైడ్రా అనే వ్యవస్థ రాకముందే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నల్లకుంట, మసాబ్ ట్యాంక్, కృష్ణానగర్‌లోనూ కబ్జాలు ఉన్నాయి. అన్నింటిపైనా ఫోకస్ పెట్టాం. కబ్జాకారులు ఎవరినీ వదిలిపెట్టం. ప్రజలు నివసించే ప్రాంతాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయం అని రంగనాథ్ స్పష్టం చేశారు.

అందరికీ భయం ఉండాలి..

హైడ్రా దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. హైడ్రాకు రెఫరెండంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. తమపై ఆరోపణలు చేసిన వారికి ఫలితాలు భిన్నంగా వచ్చాయి. రాష్ట్రంలో ఇళ్లు కోల్పోయిన పేదలు అందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించింది. ఇప్పుడు కాకపోయినా.. ఎప్పుడో ఒకరోజు అందరూ హైడ్రాను మెచ్చుకోక తప్పదు. దాంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు.. తప్పు చేస్తే భయం ఉండాలి అని రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story