- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరూర్‌నగర్ చెరువును పునరుద్ధరిస్తాం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సరూర్ నగర్ చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువును పునరుద్ధరిస్తామని, వరద నియంత్రణకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సరూర్ నగర్ చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువును పునరుద్ధరిస్తామని, వరద నియంత్రణకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. త్వరలోనే హైడ్రా ప్రభుత్వ అనుమతులతో పునరుద్ధరిస్తుందని అన్నారు. మార్చి వరకు సరూర్ నగర్ చెరువు పునరుద్ధరణ పూర్తి చేస్తామన్నారు. చెరువు ప్రస్తుతం 90ఎకరాలు ఉందని చెరువు చుట్టూ ఉన్న ప్రాంతం కబ్జాకు గురైందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఆక్రమణల జోలికి వెళ్లబోమని అన్నారు.
కానీ చెరువును డెవలప్ చేస్తామని పూడికలు తీసివేసి బ్యూటిఫికేషన్ చేస్తామన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు రాకుండా చర్యలు చేపడతామని అన్నారు. పెద్ద చెరువులు పునరుద్ధరించాలని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు సరూర్ నగర్ చెరువును పునరుద్దరిస్తున్నామన్నారు. చెరువులోకి మురికినీరు రాకుండా చర్యలు చేపడతామన్నారు. చెరువులో మట్టి తీసేయడం ద్వారా నీరు ఇంకుతుందని దాని ద్వారా స్థానికంగా భూగర్భజలాలు పెరుగుతాయని చెప్పారు. ఏడాదిలోగా పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు.






