SLBC టన్నెల్‌ వద్దకు హైడ్రా కమిషనర్ రంగనాథ్..!

by Gantepaka Srikanth |

ఆ ఎనిమిది మందికి ఏమైంది. సురక్షితంగా బయటకు వస్తారా..? అసలు ఇప్పటివరకు వారు బతికి ఉన్నారా..? లేదా? ప్రస్తుతం అందరిలోనూ ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

SLBC టన్నెల్‌ వద్దకు హైడ్రా కమిషనర్ రంగనాథ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆ ఎనిమిది మందికి ఏమైంది. సురక్షితంగా బయటకు వస్తారా..? అసలు ఇప్పటివరకు వారు బతికి ఉన్నారా..? లేదా? ప్రస్తుతం అందరిలోనూ ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాగర్ కర్నూలు(Nagar Kurnool) జిల్లా దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) వద్ద అనుకోని ప్రమాదం జరిగి ఎనిమిది చిక్కున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)లు పరిస్థితి పరిశీలిస్తున్నారు. అంతుకుముందు.. సహాయక చర్యలపై అధికారులతో నాగర్‌ కర్నూల్ కలెక్టర్ సంతోష్(Nagar Kurnool Collector Santhosh) సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) పాల్గొన్నారు. కాసేపట్లో రంగనాథ్ సైతం టన్నెల్ వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. టన్నెల్ వద్ద పరిస్థితిని పరిశీలించి అధికారులు, సహాయక చర్యల్లో పాల్గొన్న బృందాలకు పలు సూచనలు చేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు సొరంగంలో నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి అధికారులు మంత్రులకు వివరించారు. ఈ నేపథ్యంలోనే పైనుంచి తవ్వే అవకాశాలపై ఆరా తీస్తున్నారు.

Next Story