- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hydra: సంక్రాంతి సెలవు ప్రకటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
భోగి పండుగ సందర్భంగా రేపటి(సోమవారం) ప్రజావాణికి సెలవు ప్రకటిస్తున్నట్లు హైడ్రా(Hydra) కమిషనర్ రంగనాథ్(AV Ranganath) కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భోగి పండుగ సందర్భంగా రేపటి(సోమవారం) ప్రజావాణికి సెలవు ప్రకటిస్తున్నట్లు హైడ్రా(Hydra) కమిషనర్ రంగనాథ్(AV Ranganath) కీలక ప్రకటన చేశారు. తిరిగి ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. బుద్ద భవన్ (Buddha Bhavan) హైడ్రా కార్యాలయంలో నేరుగా ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఇటీవలే హైడ్రా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ప్రజావాణి ప్రారంభించిన తొలిరోజే ఏకంగా అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై 83 ఫిర్యాదులు వచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) స్పష్టం చేశారు. వివిధ జిల్లాల నుంచీ పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో వాటిని స్వీకరించేందుకు అధికారులు నిరాకరించారు. తమ పరిధిలోకి ఆ ప్రాంతాలు రావంటూ వారిని పంపించేశారు. స్వీకరించిన 83 ఫిర్యాదులపై క్రమంగా చర్యలు తీసుకుంటున్నారు.






