- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టేస్ట్ అట్లాస్ 2025: హైదరాబాద్ బిర్యానీకి గ్లోబల్ స్టాంప్
హైదరాబాదీ బిర్యానీ అంటే కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అది 400 ఏళ్ల నిజాం రాజుల సంస్కృతి, పర్షియన్-తుర్కీ ప్రభావాలు..

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదీ బిర్యానీ అంటే కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అది 400 ఏళ్ల నిజాం రాజుల సంస్కృతి, పర్షియన్-తుర్కీ ప్రభావాలు, దక్షిణ భారతీయ మసాలాల కలయిక. ఈ తరం వారికి బిర్యానీ అంటే ఒక ఎమోషన్. పెళ్లి, పుట్టినరోజు, దావత్, ఎల్లమ్మ పండుగ.. ఇలా సందర్భం ఏదైనా సరే బిర్యానీ లేకపోతే అది సెలబ్రేషన్ మాదిరిగానే కనిపించదనడంలో అతిశయోక్తి లేదు.
అందరూ మెచ్చే హైదరాబాదీ బిర్యానీ మళ్లీ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ & ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ 2025కి సంబంధించిన ‘World’s Best Rice Dishes’ లిస్ట్‌లో మన హైదరాబాదీ బిర్యానీ 10వ ర్యాంక్ సాధించి టాప్-10లో చేరింది. ఈ జాబితాలో టాప్-50లో నిలిచిన ఏకైక భారతీయ వంటకం కూడా ఇదే కావడం మనకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నలుగురు సీనియర్ చెఫ్‌లు, ఫుడ్ రైటర్లు, క్రిటిక్స్, లక్షలాది మంది ట్రావెలర్ల రివ్యూలు, రేటింగ్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్ తయారైంది.
లక్నో అవధీ, కోల్‌కతా బిర్యానీ, కశ్మీరీ గుష్టాబా రైస్ వంటి దిగ్గజాలను దాటి హైదరాబాదీ బిర్యానీ అంతర్జాతీయ స్థాయిలో టాప్-10లో నిలవడం మన నిజాం నగరం గొప్పతనాన్ని చాటింది. జాబితాలో మొదటి మూడు స్థానాలు జపాన్ వంటకాలే (నెగిటోరోడాన్, సుషీ, కైసెన్డాన్) కైవసం చేసుకున్నాయి. ఇరాన్‌కు చెందిన జెరెష్క్ పోలో కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. అయినప్పటికీ భారత్ తరపున ఒక్క హైదరాబాదీ బిర్యానీనే ఈ గౌరవాన్ని అందుకోవడం మనందరికీ గర్వపడే విషయం. కల్షీలో మగ్గే బాస్మతి, జాఫ్రాన్ సుగంధం, మసాలా వంటి రుచుల మైమరపించే కలయిక ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మళ్లీ ఒకసారి నిజాం నగరం రుచుల రాజధానిగా నిరూపించుకుంది.






